జూన్ 26, 2026
TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖనిలో పర్యావరణాన్ని కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , కమిషనర్ ( ఎఫ్ ఎ సి ) జె. అరుణ శ్రీ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో రామగుండం నగర పాలక సంస్థ , సింగరేణి కాలరీస్ కంపనీ లిమిటెడ్ , ఎన్ టి పి సి , అల్ట్రా టెక్ సిమెంట్ కంపనీ , జి పి పి పి పి జి స్వచ్చంద సంస్థ లతో కలసి సంయుక్తంగా నిర్వహించిన ర్యాలీ లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు . ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ వాడకూడదని అన్నారు. చెట్లను పెంచాలని అన్నారు. పర్యావరణంపై దుష్ప్రభావం పడకుండా కాలుష్యాన్ని నివారించే చర్యలు చేపట్టాలని అన్నారు.కాగా గోదావరిఖని ప్రదాన చౌరస్తా నుండి కోదండ రామాలయం వరకు భారీ గా ర్యాలీ నిర్వహించి అనంతరం మానవ హారం గా ఏర్పడ్డారు.

ఈ సంధర్భంగా ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా బట్ట తో చేసిన పర్యావరణ హిత సంచులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ బిక్షపతి , నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , సింగరేణి అధికారి డెనిల్ కుమార్ , ఆర్ ఎఫ్ సి ఎల్ అధికారి వి . శుక్లా , ఎన్ టి పి సి అధికారి కె వి రావు , అల్ట్రా టెక్ సిమెంట్ జి ఎం ఎస్ రెడ్డి , కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వీరేష్ , కనక జ్యోతి , రామగుండం నగర పాలక సంస్థ అధికారులు కుమార స్వామి ,శంకర్ రావు , మెప్మా టి ఎం సి రజనీ , సి ఓ లు , ఆర్ పి లు , మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Collector Aruna organized World

You cannot copy content of this page