కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో వారి కార్యాలయం వద్ద తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లతో కలిసి యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని అన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ, అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఉద్యమకారులందరికి నివాళులు అర్పించారు. ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, భాస్కర్ రెడ్డి, కాశినాథ్ యాదవ్, జి.ప్రభాకర్, రాజేష్ చంద్ర, పోశెట్టిగౌడ్, షౌకత్ అలీ మున్నా, శేఖర్ రెడ్డి, జగదీష్, సంగమేష్, అగ్రవాసు, సత్యనారాయణ, ఫారూఖ్, ఖలీమ్, మహేష్, బషీర్, అశోక్, వాలి నాగేశ్వరరావు, రఘు, రవీందర్, రాజుగౌడ్, మీసాల జానయ్య, పుల్లయ్య, సంపత్, రాజ్యలక్ష్మి, అరుణ, సౌందర్య, షేక్ బీబీ, పుట్టం దేవి, వల్లి రమణ, జబీన్, సరిత తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


