MLA Adireddy Srinivas : మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

TRINETHRAM NEWS

సిటీలోని ఈద్గా, ముస్లీం బరియల్ గ్రౌండు అభివృద్ధికి ప్రత్యేక కృషి

నూతన కమిటీలు ముస్లిం సోదరుల అభ్యున్నతికి పాటుపడాలి

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్ష
రాజమహేంద్రవరం : మైనారిటీల సంక్షేమానికి… అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. రాజమండ్రి సిటీలో వక్ఫ్ ఆస్తులైన ఈద్గా, ముస్లీం బరియల్ గ్రౌండు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వీటిని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈద్గా, ముస్లిం బరియల్ గ్రౌండుకు అధికారికంగా‌ మంచి కమిటీలను నియమించినట్లు సోమవారం తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. ఆయా కమిటీలకు అల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహ్మద్ అబ్దుల్లాతో కలిసి నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నగరంలోని ముస్లిం బరియల్ గ్రౌండును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.

అక్కడ అధ్వానంగా అడవిలా తయారై ఉందని, అక్కడకు కార్యక్రమాల కోసం వెళితే పది నిమిషాలు ఉండలేని దుస్థితి నెలకొందని ఆయన అన్నారు. రెహమత్ నగర్ షాదీఖానాకు శంకుస్థాపన చేసినా గత ఐదేళ్లు వైసీపీ ప్రజాప్రతినిధులు వాటిని పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తి చేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పుడు ఈద్గా ఆవరణ, ముస్లీం బరియల్ గ్రౌండుకు నూతన కమిటీలు నియమించామని ఆ కమిటీల ఆధ్వర్యంలో ఇవి అభివృద్ధి చెందడంతో పాటు కమిటీ సభ్యులు ముస్లీం సోదరుల అభ్యున్నతికి పాటుపడతారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆకాంక్షించారు. ముస్లీం బరియల్ గ్రౌండు లోని మొక్కలు, తుప్పలను తొలగించేందుకు, అభివృద్ధి చేసేందుకు కమిటీని నియమించి వారికి బాధ్యత అప్పగించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.

గతంలో వైసీపీ పాలనలో అన్నీ గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. రెహమత్ నగర్ షాదీఖానాకు నిధులు కూడా మంజూరై శంకుస్థాపన కూడా చేస్తే నిర్మాణం చేయకుండా ఐదేళ్ళు గాలికి వదిలేశారని విచారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యక్తం చేశారు. ఇలా అనేకమైనవి ఉన్నాయని, ఇప్పుడు ఒక్కొక్కటిగా చేసుకు వస్తున్నామని ఆయన వివరించారు. మసీదులు, షాదీఖానాల అభివృద్ధికి గతంలో శాంక్షన్ అయిన జీవోలను నిధులను మళ్ళీ పొందడానికి తిరిగి శాంక్షన్ చేయిస్తామని, ఆ జీవోలను తిరిగి బతికిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు.

మైనారీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టబడి ఉందని, నూతన కమిటీల నాయకులు వాటిని అభివృద్ధి చేయడంతో పాటు మైనారిటీల అభ్యున్నతికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. కమిటీల్లో నియమితులైన ముస్లీం నాయకులు అబ్దుల్లా, అస్లాం మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతామని, ఈద్గా, ముస్లీం బరియల్ గ్రౌండు అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని చెప్పారు. తమను ఈ కమిటీల్లో నియమించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు కూటమి ప్రభుత్వానికి వారంతా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బషీర్, మహబూబ్ జానీ, మహబూబ్ ఖాన్, ఖాన్ బాబు, అప్సరి, అహ్మదున్నీసా, జనసేన లిమ్రా బాషా, బషీర్, జిలానీ తదితరులు పాల్గొన్నారు.
ఈద్గా కమిటీ :
అధ్యక్షుడు సయ్యద్ ఆదిల్ పాషా, ఉపాధ్యక్షుడు సయ్యద్ మహబూబ్ హుస్సేన్, కార్యదర్శి ఎండి ఆరీఫుద్దీన్, కోశాధికారి ఎండి మొహరం, సభ్యులు ఎస్.కె.అబ్దుల్ రెహమాన్, ఎండి షబ్బీర్ బాషా, ఎస్.కె.జాఫర్ మొహీద్దీన్, సయ్యద్ కరీముల్లా, షేక్ ఆదిల్ బాషా లు నియమితులయ్యారు.

బరియల్ గ్రౌండు :

అధ్యక్షుడిగాఎస్.కె. అమీర్ రాజా, ఉపాధ్యక్షుడు యం.డి నజీరుల్లా ఖురేషి, కార్యదర్శి సయ్యద్ మదీనా, కోశాధికారి ఎస్.కె.ఖలీషా, సభ్యులు ఎస్.కె.మదీనా సాహెబ్, యం.డి అబ్దుల్ సత్తార్ బాషా, ఎస్.కె.ఉస్మాన్, ఎండి ఆస్పర్ ఖాన్, యం.డి తస్లీం ఖురేషి, యం.డి, సలీం, యం.డి మునార్ ఖురేషి నియమితులయ్యారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Committed to the welfare

You cannot copy content of this page

Scroll to Top