Trinethram News : రష్యా కాన్సుల్ జనరల్ వాలెరి ఖోడ్జాయేవ్ తో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి. ప్రజాభవన్ లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసిన రష్యా కాన్సుల్ జనరల్ వాలెరి ఖోడ్జాయేవ్.
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. కలిసి పని చేద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు రష్యా కాన్సుల్ జనరల్ వాలెరి ఖోడ్జాయేవ్ ను కోరారు.
ఆదివారం సాయంత్రం ప్రజాభవన్ లో రష్యా కాన్సుల్ జనరల్ వాలెరి ఖోడ్జాయేవ్ (Valerii Khodzaev) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రష్యా కాన్సుల్ జనరల్ వాలెరి ఖోడ్జాయేవ్ కు వివరించారు.
దేశంలో తెలంగాణ కొత్త రాష్ట్రం అయినప్పటికీ అభివృద్ధిలో దూసుకు వెళ్తున్నదని చెప్పారు. హైదరాబాద్ నగరంలో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నామని, రాష్ట్రంలో ఫార్మా ఇండస్ట్రీ తో పాటు ఇతర పరిశ్రమల అభివృద్ధికి అదే విధంగా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ విస్తరణకు కావలసిన సహకారాన్ని ప్రభుత్వం అందించి ప్రోత్సహిస్తున్నదని తెలిపారు.
టెక్స్ టైల్, కోల్ ఇండస్ట్రీ బయోటెక్నాలజీ, టీ హబ్, ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధి గురించి వివరించారు. రాష్ట్రంలో అద్భుతమైన మానవ వనరులను తీర్చిదిద్దిన ప్రొఫెషనల్, ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో అద్భుతమైన నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రం అనువుగా ఉంటుందని వివరించారు.
భారత్- రష్యా దేశాల మధ్య మంచి సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సత్సంబంధాలు కొనసాగించడానికి కావలసిన అన్ని రకాల సహకారాలు, సదుపాయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా వాలేరి ఖోడ్జాయేవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అడ్వాన్స్ హైటెక్నాలజీ, పురోగమిస్తున్న పరిశ్రమల అభివృద్ధిని గమనించామని చెప్పారు.
అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఫార్మా, బయోటెక్నాలజీ ,టీ హబ్, ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధి చాలా బాగున్నందున రష్యా పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


