Devarakonda Government : దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ యుద్ధంలో వీరమరణం చెందిన జవాన్లకు నివాళులు

TRINETHRAM NEWS

దేవరకొండ మే 10 త్రినేత్రం న్యూస్. స్థానిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం దేవరకొండ ఈ నెల మాసవారి సమావేశం ఈ రోజు అధ్యక్షులు తాడిశెట్టి నరసింహ అధ్యక్షతన జరిగినది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వీర మరణం చెందిన జవానులకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించిన్నాము అన్నారు. అనంతరం కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్స్ సమస్యలను పరిష్కారం చేయకపోవడం విచారకరం, ఐదు వాయిదాల కరువు బత్యం మరియు పేరివిజన్ అమలు చేయక, రిటైర్మెంట్ అనంతరం చెల్లించాల్సిన డబ్బులు 10 నెలలు గడిచినా అందక పెన్షనదారులు ఇబ్బందులకు గురివుతున్నారు.

తక్షణమే చెల్లించాలని కోరినారు. అనంతరం కోశాధికారి లింగయ్య ఆర్థిక నివేదిక సమర్పించి ఆమోదం పొందినారు.ఈ కార్యక్రమంలో సహా అధ్యక్షులు గంగిడి దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఐజాక్, పడమటి శాంతకుమారి, ప్రచారకార్యదర్శి పగిడిమర్రి సత్యమూర్తి, జిల్లా కౌన్సిల్ సభ్యులు తాడిశెట్టి సుదర్శన్, కార్యవర్గ సభ్యులు బోలుసాని సత్యనారాయణ, గుమ్మడివెల్లి కోటయ్య తదితరులు పాల్గొ న్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda Government Pensioners pay

You cannot copy content of this page

Scroll to Top