డిండి(గుండ్ల పల్లి) మే 10 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని వావిలికోల్ వడ్డెర గూడెం నుండి బ్రాహ్మణపల్లి బిటి రోడ్డును వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ డిండి మండల బిఆర్ఎస్ నాయకులు ఓర్సు ముత్యాలు సంబంధిత అధికారులను కోరారు.శనివారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలు రైతులు వాహనదారులు ఈ మార్గం గుండా వెళ్లాలంటే ఎన్నో అవస్థలు పడి,కంకర పోసి వదిలేసిన రోజుల్లో వాహనదారులు కింద పడిన సందర్భాలు ఉన్నాయని, ఇప్పటికి కంకర డస్ట్ పోసారని అదికూడా బ్రాహ్మనపల్లి వరకు పూర్తి చేయలేదని అన్నారు.వీలైనంత త్వరగా కంకర, డస్ట్ పోసి బిటి రోడ్డు నిర్మాణం పూర్తి చేసేలా సంభంధిత అధికారులు కాంట్రాక్టర్ తో మాట్లాడి ప్రజలు బిటి రోడ్డును అందుబాటులోకి తేవాలని ముత్యాలు కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


