CM Revanth Reddy : ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి అత్యవసర భేటీ

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత రెడ్డి పలువురు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి ఈ సమీక్ష నిర్వహిస్తారు. సీఎస్, డీజీపీలతో పాటు అందుబాటులో ఉన్న స్థానిక మిలిటరీ అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం జరపనున్నారు. యుద్ధం నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని, అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఏవైనా అనుమానాలుంటే వెంటనే పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

కాగా గత నెల ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సేనలు ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై నిర్వహించిన కచ్చితమైన దాడులలో సుమారు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. భారత సైన్యం, వైమానిక దళం, నావికా దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో.. కొట్లీ, బహవల్పూర్, ముజఫరాబాద్, మురిద్కే, అహ్మద్‌పూర్ ఈస్ట్ సహా మొత్తం 9 ఉగ్రవాద స్థావర

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Revanth Reddy holds

You cannot copy content of this page

Scroll to Top