Kalyana Lakshmi Cheques : ఎమ్మెల్యే చేతులమీదుగా కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత

TRINETHRAM NEWS

డిండి మండలమునందలి 17 గ్రామ పంచాయతిలకు సంబందించిన 21 లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేత – తహసీల్దార్ అంబటి ఆంజనేయులు

పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం. నేనున్నానంటూ నిరుపేదలకు అండగా నిలుస్తున్న దేవరకొండ శాసన సభ్యులు శ్రీ నేనావత్ బాలు నాయక్

డిండి (గుండ్లపల్లి) మే 2 త్రినేత్రం న్యూస్. డిండి మండలమునందలి 17 గ్రామ పంచాయతిలకు సంబందించిన 21 లబ్ధిదారులకు నేడు కల్యాణ లక్ష్మి చెక్కులను దేవరకొండ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే అధికారపు క్యాంపు కార్యాలయం నందు దేవరకొండ నియోజక వర్గంలోని డిండి మండలానికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేసిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ కల్యాణలక్ష్మి షాదీముబారక్ నిరుపేద ప్రజలకు ఒక వరం అని అన్నారు.గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే, ఎంపిల కార్యాలయాల వద్ద చెక్కుల కోసం పడిగాపులు కాచేవారని నేడు లబ్దిదారులకు నేరుగా అందజేయడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా కల్యాణలక్ష్మి చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయంతో లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామన్నారు.
గత ప్రభుత్వంలో లబ్ధిదారులకు కనీసం ఇలాంటి మంచి కార్యక్రమమునకు సరైన సమయానికి నిధులు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెండింగ్‌ వాటిని కూడా మంజూరు చేశామని అన్నారు. నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని అన్నారు. పేదలకు కూడా కల్యాణలక్ష్మి / శాదిముబారక్ లాంటి పేదవారి కుటుంబములకు అందాలనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తూ, అర్హులైన పేదలకు న్యాయం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో జరుగుతుందని అన్నారు.గత 10 సంవత్సరాల తెరాస పాలనలో తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రముగా మార్చి రాష్ట్రాన్ని దివాలా తీయించడమే కాకుండా నిరుపేదలకు అందించాల్సిన సీఎంఆర్ఎఫ్ లో కూడా అవినీతికి పాల్పడిందని అన్నారు.ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి పేదవాడికి ఆదుకోవాలనే సంకల్పంతో…గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న చెక్కులను కూడా మంజూరు చేసి, అందించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి లబ్ధిదారుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA hands over Kalyanalakshmi

You cannot copy content of this page

Scroll to Top