త్రినేత్రం న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం
అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలంలో పర్యటించిన గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఇందిరమ్మ చెరువు బాట కార్యక్రమం ద్వారా పాతగంగారం పూసుకుంట గ్రామాలలో పలు చెరువులు పంటకాలువల మరమ్మతులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలో గల రైతువేదిక నందు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఇరవై రెండు చెక్కులను లబ్ధిదారులకు అందించారు. అదేవిధంగా రాజుపేట గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ములకలపల్లి అన్నపురెడ్డిపల్లి మండలాల స్థాయి రాజుపేట సూపర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి,మాజీ సర్పంచ్ కారం సుధీర్,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పాలకుర్తి సుమిత్, ములకలపల్లి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కోడిమే వంశీ,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


