జల్ జీవన్ మిషన్ బోరు మరమ్మత్తులపాలై గ్రామస్తులు ఇబ్బందుల్లోకి
అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్ ఏప్రిల్ 30: అరకువేలి మండలం బొండం పంచాయతీ పరిధిలోని కొత్తవలస గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉధృతమైంది. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన బోరు కొన్ని నెలల్లోనే మరమ్మత్తులకు గురై పని చేయడం మానేసింది. ఫలితంగా గ్రామస్తులు త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
త్రాగునీటి కోసం ప్రజలు గ్రామ చివర ఉన్న ఊట గెడ్డ వద్ద పైపు ఏర్పాటు చేసుకుని నీరు తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు గ్రామ ప్రజలు ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి గత్తుం బుజ్జి బాబు సహాయంతో తమ సమస్యలను తెలియజేయడానికి పబ్లిక్ గ్రీవెన్సుకు వెళ్లగా, అధికారులు అప్పటికే కార్యక్రమాన్ని ముగించి వెళ్లిపోయినట్లు తెలిసింది.
మండల కేంద్రానికి రవాణా సౌకర్యం లేకుండా ఉండటంతో, మారుమూల గ్రామాల ప్రజలు ఉదయం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాలకు సమయానికి చేరుకోలేకపోతున్నారు. గ్రీవెన్స్ సమావేశాలను పూర్తి రోజు నిర్వహించాలని, అలాగే అన్ని శాఖల అధికారులు పాల్గొనేలా చూడాలని గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
గ్రామంలోని త్రాగునీటి సమస్య తక్షణమే పరిష్కరించేందుకు కొత్త బోరు మరియు కరెంట్ మోటర్ మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె. రామారావు, గిరిజన సంఘం నాయకులు జి. సత్యరావు, జి. వెంకట రమణ, జి. రామస్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


