R&B Road : ఆర్ అండ్ బి రోడ్డు ఆక్రమణల తొలగింపు చర్యలు

TRINETHRAM NEWS

ఎంపీడీవో,ఇంచార్జ్ డిఎల్పిఓ రాజు…

ఆలమూరు : త్రినేత్రం న్యూస్. ఆర్ అండ్ బి రహదారిగా ఉన్న మండలంలోని చొప్పెల్ల ప్రధాన రహదారి ఆక్రమణలు తొలగింపుకు చర్యలు చేపట్టినట్లు ఇన్చార్జ్ డిఎల్పిఓ, ఎంపీడీవో ఏ.రాజు అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పంచాయతీ కార్యదర్శి మల్లిడి విజయరెడ్డితో కలిసి జెసిబి సాయంతో జరుగుతున్న ఆక్రమణల తొలగింపులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలందరి సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ప్రధాన రహదారులను ఆక్రమించడం నేరమన్నారు.

రోడ్డు పక్కన నివాసాలు ఉండే వారు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ఇల్లు నిర్మాణాలు చేసుకోవాలన్నారు. నిబంధనలు ఎవ్వరూ అతిక్రమించవద్దని, అలా పాల్పడే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గ్రామ ప్రధాన వీధులు విశాలంగా ఉంటే ట్రాఫిక్ అంతరాయాలు వంటి పలు ఇబ్బందులు ఉండవని గ్రామస్తులకు ఎంపీడీవో రాజు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది శ్రీనివాస్, సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Steps to remove encroachments

You cannot copy content of this page

Scroll to Top