Rahman Foundation : రాథోడ్ కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన రెహమాన్ ఫౌండేషన్ సామాజిక సేవకులు

TRINETHRAM NEWS

పెద్దకర్మ కార్యానికి రెహమాన్ ఫౌండేషన్ వారిచే 7000/- రూపాయలు ఆర్థిక సాయం అందజేత

రాథోడ్ కృష్ణ కుటుంబానికి అండగా ఉంటాం – డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ (రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్)

Trinethram News : లింగాపూర్ : మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు రాథోడ్ కృష్ణ గత కొద్దిరోజుల క్రితం ఆకస్మికంగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో మంగళవారం వారి 13వ రోజు (తెర్వి) పెద్దకర్మ కార్యానికి హాజరైన రెహమాన్ ఫౌండేషన్ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి చిత్ర పటానికి నివాళులర్పించారు. రెహమాన్ ఫౌండేషన్ ద్వారా ఆ పేద కుటుంబానికి 7000/- రూపాయలను ఆర్థిక సహాయంగా రెహమాన్ ఫౌండేషన్ సామాజిక సేవకుడు జాటోత్ దవిత్ కుమార్ చేతుల మీదుగా మృతుని తల్లి రాథోడ్ విజయ బాయికీ అందజేశారు. బాధితుడి కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు.

భవిష్యత్తులో ఏలాంటి ఆపద వచ్చిన మృతుని కుటుంబానికి అన్ని వేళల అండగా ఉంటామనీ రెహమాన్ ఫౌండేషన్ ద్వారా భరోసానిచ్చారు. పేద కుటుంబాలు ఏ కష్టంలో ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే సామాజిక సేవలో భాగంగా తమవంతుగా సహాయం చేస్తామని తెలిపారు. యువత సామాజిక సేవలో ముందుకు రావాలనీ రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ అన్నారు. రెహమాన్ ఫౌండేషన్ సామాజిక సేవల ద్వారా చూపుతున్న దాతృత్వానికి గ్రామస్తులు ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు జాధవ్ సుశీల్, రాథోడ్ నరేష్, దవనే విశ్వకాంత్, జాధవ్ మారుతీ, రాథోడ్ ధరం, రాథోడ్ రాజేష్, జాధవ్ జైల్సింగ్ తదితరులు పాల్గొన్నారు.!!

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rahman Foundation social workers

You cannot copy content of this page

Scroll to Top