త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. తెలంగాణ ప్రభుత్వ సన్న బియ్యం పథకాన్ని ఆచరణలో చూసేందుకు ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సీతాయిగూడెం పంచాయతీ నల్లముడి గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడు పుచ్చకాయల వాసు ఇంటిని సందర్శించి మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలకులు ప్రజలకు చేరువైతేనే వారి కష్టసుఖాలు తెలుస్తాయని ఈ ప్రజా ప్రభుత్వంలో పథకాలు కేవలం గెజిట్ పత్రాలకే పరిమితం కావని రాష్ట్రప్రజల ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని బడుగు బలహీన అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అని ఈ సందర్భంగా తెలిపారు.
అనంతరం గుట్టగూడెం గ్రామంలో సమ్మక్క సారలమ్మ అమ్మవారి జాతర వేడుకలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే టేకులగుంపు గ్రామంలో పాండ్ర శ్రీను ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ రోజు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించారు.ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


