పెద్దపల్లి మండలం అప్పన్నపేట త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి మండలం అప్పన్నపేట వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడ్డ 29 మంది క్షతగాత్రులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా విషయం తెలుసుకున్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రభుత్వ ఆసుపత్రి కి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు.
క్షతగాత్రులకు మనోధైర్యాన్ని అందించి ప్రమాద సంఘటన వివరాలను పోలీస్ వారిని ఆర్టీసీ వారిని అడిగి తెలుసుకొని అనంతరం క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సుపరిడిండెంట్ శ్రీధర్, పెద్దపల్లి ఆర్టీసీ రామ్,ఎ.సి.పి గజ్జి కృష్ణా, సి.ఐ ప్రవీణ్, ఎస్సీలు, వైద్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


