MLA Jare : ములకలపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారె

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం

ప్రభుత్వ పాఠశాలలకు మౌళిక సదుపాయాలకోసం నిధులు కేటాయింపు

ములకలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, విజయపురికాలనీ, గొల్లగూడెం ప్రాథమిక పాఠశాలలు మాదారం గ్రామపంచాయతీ లోని సత్యంపేట, రామాంజనేయపురం ప్రాథమిక పాఠశాలలను గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో త్రాగునీరు విద్యుత్ సౌకర్యం మైనర్ రిపేర్లు మరుగుదొడ్లు లాంటి వసతులు పాఠశాలలలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు.
ములకలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల నిర్వహించిన చెకుముకి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందించారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల శాతం పెరగాలని తల్లిదండ్రులతో మాట్లాడి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. డ్రాప్అవుట్ స్టూడెంట్స్ మళ్ళీ చదువుకునేలా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare visited Mulakalapalli

You cannot copy content of this page

Scroll to Top