నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. దేవరకొండ ఏప్రిల్ 17 త్రినేత్రంన్యూస్. చింత పల్లి మండలకేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ భూ భారతి చట్టం 2025 పై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎంఎల్ఏ బాలు నాయక్ మాట్లాడుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రెవెన్యూ అధికారులను కోరారు.
తెలంగాణలో వివాదారహిత భూ విధానాలు ఉండాలన్నదే లక్ష్మణ్ స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతి శుభ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టం ,భూభారతీ పోర్టల్ ను ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి శిల్ప కళా వేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తెలంగాణ ప్రజలకు అంకితం చేశారన్నారు.
పైలట్ ప్రాజెక్టు గా తొలి విడత భూభారతిని నాలుగు మండలాల్లో చేపడతామని అన్నారు. ప్రజా పోరాటాలు నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చుట్టాలు ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే ఆశగా ఉండాలని ప్రభుత్వ ఉద్దేశం. ఈ చట్టాన్ని ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని అన్నారు. రెవెన్యూ అధికారులు ప్రజలకు చేరువలో ఉండాలన్నది,ప్రభుత్వ ఉద్దేశం. అందుకోసమే 10954 గ్రామ పాలన అధికారులను నియమించబోతున్నట్లు చెప్పారు.
అవినీతికి పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవరిస్తామని, ఎంతో మంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి భూములకు సంబంధించిన శాశ్విత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో భారతి చట్టం తెచ్చామని చెప్పారు. ప్రతి గ్రామం లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి విజ్ఞప్తులను తీసుకొని వాటిని పరిష్కరించాలి. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే రెవెన్యూ సిబ్బంది రైతాంగాన్ని రెండు కళ్ళ లాంటి వారని రెవెన్యూ శాఖపై కొందరు సృష్టించిన అపోహలను తొలగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు .
ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఏఎస్పీ మౌనిక, నల్గొండ జిల్లా రెవెన్యూ జెసి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఉజ్జయిని యాదగిరిరావు, మార్కెట్ చైర్మన్ దొంత అలివేలు సంజీవరెడ్డి, ఆర్డీవో రమణా రెడ్డి, తహసిల్దార్ శర్మ, ఎంపీడీవో సుజాత, అగ్రికల్చర్ ఏ డీ శ్రీలక్ష్మి, అగ్రికల్చర్ ఏవో శ్రావణి కుమారి, పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ జెడ్పిటిసి లు, మాజీ ఎంపీపీ లు, యువ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బి ఆర్
అంబేద్కర్ జయంతి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


