త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం
- ప్రభుత్వ వారిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
- పలు కుటుంబాల పరామర్శ
ములకలపల్లి మండలం చాపరాలపల్లి గ్రామంలో ప్రభుత్వం ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమిత సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నరకం వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ అందించటం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని రైతు కష్టానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే గౌరవమని తెలిపారు. ఈ సందర్భంగా తాను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినేనని గుర్తు చేశారు.
రైతే మన దేశానికి వెన్నుముక్క అని రైతు ఆరుగాలం కష్టపడితేనే మనమంతా తినగలుగుతున్నామని అలాంటి రైతుకు మద్దతుగా నిలవాలని తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షలరుణమాఫీ 24 గంటల ఉచిత విద్యుత్ రైతు భరోసా పామాయిల్ పంటకు మద్దతు ధర వరిధాన్యానికి బోనస్ లాంటి పథకాలతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలు అందిస్తుందని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం నేరుగా ధాన్యం సేకరించడం వలన మధ్యవర్తుల దోపిడీకి అవకాశం లేకుండా ఉంటుందన్నారు. రామచంద్రాపురం గ్రామంలో బాల్ద అరుణమ్మ పూరిల్లు ఇటీవల అగ్ని ప్రమాదంలో కాలిపోగా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
చాపరాలపల్లి ఎస్సీ కాలనీలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కాకాటి రాఘవులు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో గుడ్ల పుల్లారావు, ఎంపీడీవో గద్దె రేవతి, పిఎసిఎస్ చైర్మన్ సునంద, అగ్రికల్చర్ ఏవో అరుణ్ కుమార్,మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి, మాజీ సర్పంచ్లు కారం సుధీర్, సున్నం సుధాకర్,మండల కిసాన్ సెల్ అధ్యక్షులు అచ్చన వెంకటేశ్వరరావు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


