TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. కార్మిక పక్షపాతి కార్మికోద్యమ నాయకుడు బిటి రణదేవే, మహాత్మ జ్యోతిబా పులె, బాబా సాహెబ్ అంబేత్కర్ మహనీయుల ఆలోచనలు,ఆశయాలు ముందుకు తీసుకపోవలీ. పేదల,కూలీల హక్కులకై పోరాడుదాము అత్వెల్లి లో ఉపాధి కూలీలకు పెండింగ్ 7వరాల డబ్బులు వెంటనే ఇవ్వాలి. పనిప్రదేశంలో కనీస వసతులు కల్పించాలి. 200వందల పనిదినాలు కలిపించి, రోజుకు 600కూలీ ఇవ్వాలి సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాలకి డిమాండ్. నేడు cpm నాయకులు వికారాబాద్ జిల్లా, మండల పరిధిలోని అతేల్లి గ్రామంలో ఉపాధి కులాల పనిప్రదేశంలో పర్యటించి పనిలో వస్తున్న ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది.

ముందు మహాత్మ జ్యోతి బా పులే జయంతి నిర్వహించి అనంతరం కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు cpm జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ మాట్లాడుతూ ఉపాధి కూలీలకు 7వారాల కూలి పెండింగ్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలకు డిమాండ్ చెయ్యడం జరుగుతుంది. పని ప్రదేశంలో కూలీలకు ORS పాకెట్స్, మెడికల్ కిట్స్ ఇవ్వాలి. టెంటూ, మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలి. పనిముట్లు ఇవ్వాలి పెండింగ్ డబ్బులు ఇవ్వాలి. పనిలో వస్తున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. దేశంలో పెరుగుతున్న డీజిల్, పెట్రోల్,గ్యాస్ ధరలకు అనుగుణంగా MLA,MP లా జీతాలు లక్షలలో పెంచుకున్నారు ఓట్లు వేసి ఘనంగా గెలిపించిన కూలిలకు కనీస మద్దతు కూలి రెట్లు రోజుకు 600 చొప్పున పెంచాలి. 200 రోజులు పని దినాలు కల్పించాలి. ప్రమాద బీమా సౌకర్యం 6లక్షలు ఇవ్వాలి. సీనియర్ మెట్లకు అదనపు డబ్బులు ఇవ్వాలి. లేబర్ ఇన్సూరెన్స్ పాలసీ సౌకర్యం కల్పించాలనీ ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాము.

గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలనీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాము.గ్రామాము లో మురుగు నీరు చెత్తాచెదరం ఈగలు దోమలు రోడ్లపై ఎరులై పారుతుంది. అగ్రవర్ణాల ఇండ్ల మలమూత్రలు దళితుల ఇండ్ల ముందు కు వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. వెంటనే చర్యలు చేపట్టాలని, డిమాండ్ చేస్తున్నాము.లేనిచో మండల జిల్లా ఆఫీసుల ముందు ఆందోళనలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కూలీలు అంజయ్య దేవయ్య ప్రతాప్ రాములు బుచ్చయ్య అరవింద్ కుమార్ రాజు శ్రీనివాస్ శంకర్ నవీన్ ప్రతాప్ భూదేవి లక్ష్మి అరుణ అనంతము నర్సమ్మ స్వామి దాసు నర్సింలు లక్ష్మయ్య మల్లయ్య సంగయ్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minimum wage of 600 s