జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వికారాబాద్ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ పదవి విరమణ ఆత్మీయ విడుకోలు కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ సమావేశం హాలు నందు ఎంతో ఆర్భాటంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథిగా హాజరై సి పి ఓ జిల్లాకు అందించిన సేవలను గుర్తు చేశారు. ప్రతీ ఉద్యోగికి పదవి విరమణ తప్పదని, కానీ ఉద్యోగ పరంగా మనం ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండి పోతాయన్నారు.
ఆయన తో కలిసి తాను గత కొద్ది రోజులుగా పనిచేశానని, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని,కలెక్టర్ వారి సేవలను కొనియాడారు. పదవి విరమణ అనంతరం కుటుంబానికి కూడా సమయం ఇవ్వాలని సూచించారు. అంతకు ముందు పలువురు జిల్లా అధికారులు, విధి నిర్వహణలో తమకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, చిత్తశుద్ధిని వారంతా కొనియాడారు. ఈ సందర్బంగా శాలువా తో సన్మానం చేసి మెమంటో అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, డిఆర్డిఓ శ్రీనివాస్, సిపిఓ వెంకటేశ్వర్లు, సాంఘిక సంక్షేమ అధికారి మల్లేశం, కలెక్టరేట్ లోని వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


