జగదీష్ రెడ్డి సస్పెన్షన్ వెంటనే ఎత్తి వేయాలి.
కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి.
ప్రజలకు వచ్చిన వాగ్దానాలను హామీలను వెంటనే అమలు చేయాలి.
లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించక తప్పదు.
డిండి పట్టణ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గిర మోనీ శ్రీనివాస్.
డిండి (గుండ్ల పల్లి) మార్చి 16 త్రినేత్రం న్యూస్. డిండి పట్టణ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గిరమోని శ్రీనివాస్ ఆదివారం నాడు ఒక సందర్భంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కక్షపూరితమైన రాజకీయం చేస్తుందని, ఇచ్చిన హామీలను వాగ్దానాలను ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలను తుంగలో తొక్కి, బిఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రతిరోజు తిట్టడమే ధ్యేయంగా పనిచేస్తుందని, ప్రజలకు ఇచ్చిన హామీ లను నెరవేర్చ కుండా దాటవేయు ప్రయత్నం చేస్తూ వాళ్లు ఇచ్చిన హామీలను ప్రజలు మరిచే విధంగా, బిఆర్ఎస్ పార్టీ నాయకులపై దురద చల్లే విధంగా మాట్లాడుతున్నారు, వాళ్లు మాట్లాడింది వేద వాక్కు అని, ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల గురించి ప్రశ్నిస్తే వారిపై తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఇచ్చిన వాగ్దానాల గురించి హామీలను విస్మరించారని ప్రజల కోసం మాట్లాడితే అలాంటి వారిపై కేసులను మోపడం సరైనది కాదని , ప్రశ్నించే గొంతు కలను నొక్కడం ప్రజలు గమనిస్తున్నారు, సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్తారని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి సూర్యాపేట శాసన సభ్యులు గుంత కండ్ల జగదీశ్ రెడ్డి పై అసెంబ్లీలో విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాలుగా మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న, సభలో మాట్లాడరాదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజ్ఞత లేని విషయం అని ఇది కేవలం కక్షపూరితంగా కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ను ఎండగడతారని ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తున్నారని, కావాలనే జగదీశ్ రెడ్డి పై సస్పెన్షన్ వేశారని, ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను స్మరి స్తున్నారు ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని భయంతో ఏదో ఒకటి కుంటి సాకు చూపించి అసెంబ్లీకి రాకుండా చేశారని సందర్భంగా ఆయన తెలియజేశారు.
జగదీశ్ రెడ్డి ప్రజా నాయకుడ ని ప్రజల కోసం ప్రజల క్షేమం కోసం నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ కాంగ్రెస్తో కొట్లాడుతుంటాడని, పంటలకు నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు విలపిస్తుంటే వారి వద్దకు వెళ్లి ఓదారుస్తున్న గొప్పదయ హ్రుదయం కలవాడని, తాగునీరు లేక గ్రామాలలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేక పోతుందని, ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వం పై త్వరలో తిరగబడి గుణపాఠం చెప్తారని అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదు అని అన్నారు.
ఇప్పటికే గ్రామాలలో తిరుగుబాటు మొదలైందని కొంతమంది నాయకుల పోకడ ప్రజలను ఇబ్బందు లు మరియు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాళ్ళ ఆటలు రాబోయే రోజులలో సాగవని అట్లాంటి వారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని స్థానిక నాయకులను హెచ్చరించారు.
నాయకులంటే ప్రజల కోసం ప్రజల తరఫున ప్రజల సమస్యలను నెరవేర్చుకుంటూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, గ్రామాలలో ప్రజల సమస్యలు ఏమున్నాయి వాటిని ఏ విధంగా నెరవేర్చాలని ఆత్మ పరిశీలన చేసుకుని వాటిని త్వరగా నెరవేర్చే దిశగా పనిచేయాలని, కక్షపూరితంగా వ్యవహరించకుండా అందర్నీ కలుపుకుంటూ నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యలను తీర్చాలని ప్రభుత్వాన్ని మరియు నాయకులను ఈ సందర్భంగా తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


