
వేల్పుల కుమారస్వామి, రాష్ట్ర కార్యదర్శ (SCKS – CITU).
గోదావరిఖని మార్చి-13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి సంస్థ ఆర్జీ-1లోని సివిల్ విభాగం సెక్టర్ 2లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హెచ్డీఫ్సీ బ్యాంకు ద్వారా జీరో అకౌంట్ ఖాతా ఓపెన్ చేసి దానిద్వారా కార్మికులకు జీతాలు చెల్లించాలనీ సంబంధిత కాంట్రాక్టర్ రమేష్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఈరోజు వినతి పత్రాన్ని అందివ్వడం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులు గతంలో ప్రమాదవశాస్తు మరణించినప్పుడు వారి కుటుంబాలకు సింగరేణి యాజమాన్యం గానీ, కాంట్రాక్టర్లు గానీ తగిన నష్టపరిహారం ఇచ్చేవారు కాదని అన్నారు. నామ మంత్రంగా నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి ఉందన్నారు.
ఇలాంటి పరిస్థితులు మారాలని సిఐటియు అనేక సందర్భాల్లో శవాలను పట్టుకుని కుటుంబ సభ్యులతో రాత్రి, పగలు తేడాలేకుండా హాస్పిటల్ల ముందు, జీ.ఎం. కార్యాలయం ముందు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి, బందుపిలుపులు ఇచ్చి అధికారులతో, కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి మరణించిన కాంట్రాక్టు కార్మికుని కుటుంబానికి నష్ట పరిహారం ఇప్పించిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. ఈ పరిస్థితులు మారాలని పర్మినెంట్ కార్మికులకు ఇస్తున్నట్లుగా నష్టపరిహారం ఇవ్వాలని సీఐటీయూ చేసిన పోరాట ఫలితంగా సింగరేణి యాజమాన్యం హెచ్డీఫ్సీ బ్యాంకు అధికారులతో చర్చించగా అందుకు బ్యాంకు అధికారులు తమ బ్యాంకులో ఖాతా తీసుకున్న కాంట్రాక్టు కార్మికుడు ప్రమాదంలో మరణించినయెడల అతని కుటుంబానికి
30 లక్షలు రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వడానికి బ్యాంకు అధికారులు అంగీకరించి సుమారు సంవత్సరం గడుస్తున్నా ఆర్జీ వన్ లో కాంట్రాక్టర్లు మాత్రం ఇంకా బ్యాంకు ఖాతాలు ప్రారంభించి దాని ద్వారా జీతాలు చెల్లించడం లేదని అన్నారు. కాంట్రాక్టర్లు బ్యాంకు ఖాతాలు ప్రారంభించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఒకవేళ కర్మికునికి ఏదైనా నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు.
ఇప్పటికైన కాంట్రాక్టర్లు కార్మికుల,వారి కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ఆలోచించి వెంటనే హెచ్డీఫ్సీ బ్యాంకు ద్వారా జీరో అకౌంట్ ఖాతా ఓపెన్ చేసి దాని ద్వారా జీతాలు చెల్లించాలని కాంట్రాక్టర్ మరియు అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో కార్మికులు జూపాక సాగర్,మదు,సారయ్య, శంకరయ్య,గౌరయ్య, వెంకటేష్,వినయ్, రాజేష్, వేణు, అనిల్, శేకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
