కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 9 : కూకట్పల్లి మున్సిపాలిటీ భరత్ నగర్ కాలనీ మాజీ కౌన్సిలర్ శివలింగారెడ్డి సంతాప సభను ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పాల్గొని శివలింగారెడ్డి ఫోటో కు పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీకి అంకితమై కొనసాగిన శివలింగారెడ్డి సేవలు చిరస్మరణీయమన్నారు.పార్టీ కార్యకర్తలు శివలింగారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, శివ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


