కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 8 : ప్రజలకు సేవ చేయాలి, మంచి చేయాలి, మంచి జరగాలి అనే దృక్పథంతో పని చేస్తే పార్టీలో పదవులు వాటి అంతటవే వస్తాయని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ, ఇన్చార్జి బండి రమేష్ అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వందల మంది మహిళలతో కలిసి ఆయన శనివారం బాలానగర్ లోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు.హాజరైన పార్టీ కార్యకర్తలు, మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా, బండి రమేష్ మాట్లాడుతూ అధికారం అవకాశం మగవాళ్ళ నుండి ఆశించే స్థాయి నుంచి అవకాశాలను అందిపుచ్చుకొని ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన మహిళలు దేశానికే గర్వకారణం అని పేర్కొన్నారు.మళ్లీ ఎన్నికలు వచ్చేనాటికి కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాయన్నారు.పార్టీ పదవులు త్వరలోనే అందరికీ వస్తాయన్నారు.దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కుల గణన చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 42 శాతం సీట్లు బీసీలకు కేటాయించిందన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ ,బ్లాక్ అద్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు , యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, మైనారిటీ నాయకులు, ఎస్ సి సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు మరియు కార్యకర్తలు , మరియు యూత్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


