Padmasali Mahasabha : పద్మశాలి మహాసభలను విజయవంతం చేయండి

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని మార్కండేయ కాలనీలోని శివాలయంలో కరపత్రంను విడుదల చేసిన పద్మశాలి సేవా సంఘం ప్రతినిధులు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 17వ అఖిల భారత పద్మశాలి మహాసభ, 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ సభలకు ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. ఈ సభలను విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు. మంగళవారం స్థానిక మార్కండేయ కాలనీలోని శివాలయంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బండారి రాయమల్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అడక్ కమిటీ చైర్మన్ వలస నిలయ్య, తెలంగాణ పద్మశాలి సేవా సంఘం ఆర్గనైజ్ సెక్రెటరీ బుర్ల లక్ష్మినారాయణ, పాల్గొని మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండెటి రాజేష్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చందు పెగడ, పోపా అధ్యక్షులు వడ్డేపల్లి దినేష్, RS మూర్తి, , సిరిపురం నరసయ్య, గుండెటి శంకర్, అన్నల్ దాస్ శ్రీనివాస్, బొద్దుల వేణు, కన్నం ప్రభాకర్, రాజేష్, దాసరి శ్రీనివాస్, బండారి స్రవంతి, తౌటం శాంతి, చింతల రాజేందర్, నాగేశ్వర రావు, సోడాల శ్రీను, బొడ్డుల శ్రీను, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

 Padmasali Mahasabha a success

You cannot copy content of this page

Scroll to Top