TRINETHRAM NEWS

భూపాలపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండల కేంద్రం ఎంతో మంది ఔత్సాహికు లైన పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతం నుంచి నిత్యం ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతోపాటు, సరిహద్దు రాష్ట్రాలను జిల్లాలను కలిపే కాటారం మండలం లో కనీసం బస్ షెల్టర్ కూడా లేకపోవడం విడ్డూరం

గోదావరిఖని,భూపాలపల్లి,కాళేశ్వరం, హనుమకొండ, వరంగల్, మంథని, కరీంనగర్ జిల్లాలకు వెళ్ళవలసిన ప్రయాణికు లు కాటారం మండల కేంద్రానికి రాక తప్పదు.

కాటారం మండలంలో బస్‌ షెల్టర్‌ లేకపోవడంతో ప్రయా ణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళ ప్రయాణికులు గంటల తరబడి రోడ్డుపైనే నిలబడవలసి వస్తుంది ఎండకు ఎండుతూ. వర్షం వస్తే తడవవలసిందే..

బస్‌ షెల్టర్‌, ఏర్పాటుతో పాటు, కూర్చోవడానికి, బెంచీలు ఏర్పాటు చేయా లని, భూపాలపల్లి డిపో మేనేజర్ కు ఎన్నిసార్లు ప్రయాణికుల సమస్యలను విన్నవించిన నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుంది, అక్కడ ప్రయాణికులకు బస్ షెల్టర్, కూర్చోడానికి బెంచ్ లు ఏర్పాటు చేస్తే నాకేంటి లాభం అన్నట్లు వ్యవహరిస్తుంది,

ప్రయాణికుల శ్రేయస్సు ఆర్టీసీకి ముఖ్యం అని గొప్పలు చెప్పుకుంటున్న ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల ఇబ్బందులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ప్రయాణికులు, స్థానికులు వాపోతున్నారు.

ప్రభుత్వాలు మారినా మండల కేంద్రంలో బస్సు షెల్టర్‌ ఏర్పాటు కల నెలవేరడం లేదు

పట్టించుకోని పాలకులు, ఆర్టీసీ అధికారులు

గతంలో కాటారం మండల కేంద్రంలో బస్సు షెల్టర్‌ ఉండేది. అది శిథిలావస్థకు చేరడంతో అప్పటి నుంచి ప్రయాణికులకు కష్టాలు తప్పడంలేదు. మండల కేంద్రంలో బస్‌స్టాండ్‌ నిర్మించేందుకు ప్రభుత్వ భూమి ఉందని,అక్కడే బస్‌స్టాండ్‌ నిర్మించాలని ప్రజలు అనేకమార్లు ఆర్టీసీ అధికారులకు, పాలకులకు మొరపెట్టుకున్న కార్యరూ పం దాల్చడం లేదు.

ఇప్పటికైనా స్పం దించి కాటారం మండల కేంద్రంలో బస్‌ షెల్టర్‌తో కూర్చోవడా నికి బెంచీలు మహిళ ప్రయాణికులకు మరుగు దొడ్లు, టాయిలెట్లు నిర్మిం చాలని ప్రయాణికులు కోరుతున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

 busstand in Mantri's constituency