ప్రగతి భవన్‌లో కంప్యూటర్లు మాయం!
ప్రజా భవన్ (ప్రగతి భవన్) నుంచి కీలక కంప్యూటర్లు మాయం అయినట్టుగా తెలుస్తోంది.
కేసీఆర్ నివాసాన్ని ఖాళీ చేసిన తర్వాత వీటిని తరలించినట్టుగా ప్రచారం జరుగుతోంది.
అందులో కీలక సమాచారం ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.
దీంతో తీసుకెళ్లింది ఎవరు? ఎందుకు తీసుకెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.