TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం డిండి మండల పరిధిలోని కామేపల్లి గ్రామంలో ఆదివారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరుపుకోవడం జరిగింది.
20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి గత 20 సంవత్సరాలలో జరిగిన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులు ఉపన్యాసం ఇచ్చారు.
దేశ భవిష్యత్తు మీ భుజాల మీద ఉంచాము మీరే చక్కని విద్యార్థులను మంచి తల్లిదండ్రులుగా అందివ్వ గలరని కోరారు. మరియు విద్యార్థులు ఉపన్యాసం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులను పూలదండలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పల్ల వెంకట్ రెడ్డి, జంగారెడ్డి, నారాయణ, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, వెంకట్ నారాయణ, గౌస్, తిరుపతయ్య, సౌజన్య, రాధా, శిరీష, నాగరత్నం, మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App