
చిత్తూరు జిల్లా కలెక్టర్ ని కలిసిన డాక్టర్ యుగంధర్ పొన్న
గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు త్రినేత్రం న్యూస్. జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ యుగంధర్ చిత్తూరు జిల్లా కలెక్టర్లు కలిసి వినతి పత్రం అందజేశారు. జీడీ నెల్లూరు నియోజకవర్గo ఆముదాల పంచాయతీలోని జడ్పీ ఉన్నత పాఠశాలను గత వారం సందర్శించాను. అప్పుడు పాఠశాలకు కొన్ని అత్యవసరమైన మరమ్మత్తులు చేయించాలని గుర్తించాను.
ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు జడ్పీ ఉన్నత పాఠశాల గేటు వద్ద ఉన్న బ్రిడ్జి కూలిపోయి ప్రమాదకరంగా మారింది. అలాగే పాఠశాలకు ఒకవైపు కాంపౌండ్ నిర్మాణం జరగలేదు. కావున ఆముదాల ఉన్నత పాఠశాలలో మరమ్మత్తులు త్వరితగతిన మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టవలసిందిగా కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు చందు రాఘవ లతీష్ కుమార్ రాఘవేంద్ర వెంకటేష్ మహేష్ పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
