TRINETHRAM NEWS

కరాటే పోటీల్లో సత్తాచాటిన శ్రీ చైతన్య విద్యార్థులు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పారిశ్రామిక ప్రాంతములోని ఆర్.ఎఫ్.సి.ఎల్ టౌన్షిప్ నందుగల శ్రీ చైతన్య సి.బి.యస్.ఇ పాఠశాలలోని విద్యార్థులు ఇటీవల హైదరాబాద్ లో “న్యూడ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్” ఆధర్వంలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలలో పాల్గొని ఏడుగురు విద్యార్థులు విజయం సాధించారు. ఇందులో ఎమ్. కుశాల్, బి.సంహిత బంగారు పతకాలు, జి.రినిత్, ఎమ్.జయదేవ్, డి. మేఘాన్ష్ వెండి పతకాలు సాధించగా, పి.విఖ్యాత్ సాయి, ఎన్.సుహాన్ష్ కాంస్య పతకాలు సాధించారు.

పోటీలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ రవిగారు భవిష్యత్ లో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అభినందనలు తెలిపారు. కరాటేలో సత్తాచాటిన విద్యార్థులకు డీన్ రమేష్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరేంద్ర కుమార్, ప్రైమరీ ఇన్చార్జి సౌజన్య, కరాటే మాస్టర్ సంపత్ కుమార్, పి.ఈ.టి స్వప్న, సందీప్, అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Chaitanya's students excelled