TRINETHRAM NEWS

గిరిజన హక్కులు కాలరాస్తే ఖబడ్దార్

ఏజెన్సీ (టీడీపీ+ బిజెపి+ జనసేన పార్టీ నాయకులు) ఆదివాసుల వైపా,ప్రభుత్వం వైపా స్పష్టం చెయ్యాలి.

అల్లూరి జిల్లా అరకు లోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 11 : నేడు 11,12 తేదీలలో జరిగే మన్యం బంద్ ను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చినఅరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం.ఈ సందర్భంగా, ఎమ్మెల్యే మాట్లాడుతూ. 1/70 భూ బదలాయింపు నిషేధ చట్టంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అవగాహన రాహిత్య వ్యాఖ్యలకు నిరసనగా నేడు, రేపు జరిగే మన్యం బంద్ ను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మన్యం బంద్ కు సంపూర్ణ మద్దతు ఇస్తుందని,స్పీకర్ వాక్యాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేయడంతో పాటు అయ్యన పాత్రుడు 1/70 చట్టాన్ని సవరించాలని పబ్లిక్ లో మాట్లాడినప్పుడు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన కూటమి నాయకులు కనీసం ఒక్కరైనా ఖండించిన దాఖలాలు లేవని,ఏజెన్సీ (టీడీపీ+ బిజెపి+ జనసేన పార్టీ నాయకులు) ఆదివాసుల వైపా,ప్రభుత్వం వైపా స్పష్టం చేయాలని పేర్కొన్నారు.
ఆదివాసుల హక్కులను హరిస్తున్న కూటమి ప్రభుత్వానికి ఆదివాసుల సత్తా తెలిసేలా,మన్యం బంద్ లో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు,ఉద్యోగస్తులు,స్వచ్ఛంద సేవ సంస్థలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువత పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tribal rights Kalaraste Khabaddar