![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-08-at-8.21.27-PM.jpeg)
వ్యాపారులు జీవితాలను రోడ్డుమీద పడేయడమేనా అభివృద్ధి
గోదావరిఖని వ్యాపారులంటే ఎమ్మెల్యే కు ఎందుకంతా కక్ష … భయాందోళనలకు గురైతున్న వ్యాపారవర్గాలు.. తోలగించిన నిర్మాణాలకు నష్టపరిహారం చెల్లించాలి .. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని ప్రధాన వ్యాపార కేంద్రం లక్ష్మినగర్ లో అభివృద్ధి పేరుతో రోడ్ధు వెడల్పుల సాకుతో దుకాణాలు కుల్చడంతో వ్యాపారులంతా భయాందోళనలను గురైతున్నారు వ్యాపారస్తుల జీవితాలను కొల్లగొట్టి వారి జీవితాలను రోడ్లపాలు చేయడమేనా అభివృద్ధా అని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ ప్రశ్నించారు శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశం ఆయన మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి, సుందరీకరణ పేరుతో చిరు వ్యాపారులు దుకణాలు కుల్చి సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు.
వ్యాపారులకు శాపంగా కాంగ్రెస్ పాలన మారిందన్నారు. గోదావరిఖని పై స్థానిక ఎమ్మెల్యేకు ఎందుకు అంతా కక్ష అని ప్రశ్నించారు. రాజకీయంగా మాపై ఏమైనా కక్ష ఉంటే ఉండొచ్చు కానీ దాన్ని వ్యాపారస్తులపై చూపించడం సరైన పద్ధతి కాదని అన్నారు. తమ హాయంలో రామగుండం నియోజకవర్గనికి మెడికల్ కళాశాల, సబ్ రిజిస్టర్ కార్యాలయం తీసుకువచ్చామని, సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని స్దానిక ఎమ్మెల్యే రామగుండం లో ఎర్పాటు చేయుంచుకున్నారని చెప్పారు పెళ్లిల్ల సీజన్ కావడంతో చిన్న చిన్న వ్యాపారస్తులకు వ్యాపారాలు జరిగే సమయమని ఈ క్రమంలో వ్యాపార కేంద్రంలో కుల్చివేతలు చెపట్టడంతో వ్యాపారాలు దివాళా తీసున్నయన్నారు. అప్పులు చేసి వ్యాపారులు చేసుకుని జీవించే వారికి దుకాణాలు కూల్చివేయడంతో వారు రోడ్డున పడుతున్నారని వ్యాపారస్తులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రత్యామ్నాయం చూపెట్టిన తర్వాతనే కూ ల్చివేతలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఎన్టీపీసీ గాంధీ నగర్లో కుల్చివేసిన చిరు వ్యాపారులకు ఇప్పటి వరకు ప్రత్యామ్నాయ చూపలేదని వెంటనే వారికి నష్టపరిహారం చేల్లించాలన్నారు. ఈ విలేఖరుల సమావేశం లో మాజీ కార్పోరేటర్ బాదె అంజలి నాయకులు నారాయణదాసు మారుతి రాకం వేణు బోడ్డు రవీందర్ సట్టు శ్రీనివాస్ జక్కుల తిరుపతి మేతుకు దేవరాజ్ తోకల రమేష్ ఇరుగురాళ్ల శ్రావన్ ఆవునూరి వెంకటేష్ బచ్చాల రాములు కనకలక్ష్మి స్వప్న తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-08-at-8.21.27-PM-1024x577.jpeg)