TRINETHRAM NEWS

మన్యం బందుకు సిపిఎం శ్రేణులు సంసిద్ధం. ఊరువాడ అంతా జోరుగా ప్రసారం

(సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు)

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 9: రాష్ట్రంలో బంద్ జయప్రదం చేయాలని ఆదివాసి గిరిగిన సంఘం అఖిలపక్ష ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలు విస్తృతంగా పంచడం జరిగింది.
ఆదివాసి గిరిజనులకు గుండెకాయ లాంటి 1/70 చట్టాన్ని హెళన చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయన్న పాత్రుడు, విశాఖపట్నంలో మాట్లాడిన తీరును ఖండింస్తూ, పార్టీలకు అతీతంగా ఆదివాసి బిడ్డలుగా ఐక్యమత్యంతో జరుగుతున్న మన్యం బందును విజయవంతం చేయాలని, విజ్ఞప్తి చేశారు. 2000 సంవత్సరంలో దుబాయ్ కంపెనీకి చింతపల్లి జరెల లో సుమారు 515 మిలియన్ టన్నుల బాక్సైట్ నిక్షేపల తవ్వకాలకు ఒప్పందం చేసి, ఆదివాసి బిడ్డలకు అన్యాయం చేయాలని చూశారు.

ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో మన్యం ప్రజలందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించడం జరిగింది. అప్పటి, టి ఎ సి తీర్మానానికి వ్యతిరేకంగా ఎం ఎల్ ఏ సున్నం రాజయ్య, తీవ్రంగా వ్యతిరేకించారు. ఆదివాసుల తరఫున పోరాటం చేశారు.ఇప్పుడు ఆదివాసి ప్రాంత ఖనిజ సంపదలు బడా పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి ఆదివాసులకు కంటిమీద కునుకు లేకుండా ప్రయత్నంలో భాగంగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడారు .ఆదివాసులు వ్యతిరేకిస్తున్నప్పటికీ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టు ఇరుగు మిల్లి లో ఆయుధ కర్మగారం, చింతపల్లి ఎర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్ట్, వంటి ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపట్టాలని ఒప్పందలు చేశారు.
చాప కింద నీరుల అరకువేలి మండలం మాదల పంచాయతీ దాబుగుడ ,సిరిగం, పంచాయతీ వర్ర గ్రామ పరిధిలో నల్ల క్వారీ చేపట్టాలని, చేస్తున్న సర్వేలు ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న చట్టాలు తొలగించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేనప్పటికీ, గిరిజన ప్రాంత ప్రజాప్రతినిధులు అమాయకత్వం వలన చట్టల జోలికి వస్తున్నారు. ఇటువంటి చట్ట వ్యతిరేకమైన విధానాలు గిరిజన ప్రాంతంలో అమలు చేయాలని చూస్తే సహించేది లేదు.ఇప్పటికైనా ఆదివాసి ప్రాంత ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, నోరు విప్పి ఆదివాసుల పక్షన ఉండాలి అని డిమాండ్ చేశారు. గిరిజన చట్టాలకు వ్యతిరేకమైతే తమ పదవులకు దూరంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం.
ఫిబ్రవరి 11 -12 తేదీల్లో జరుగుతున్న 48 గంటల రాష్ట్ర మన్యం బందును విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క ఆదివాసి నాయకులు ప్రజలు విద్యావంతులు యువత పాల్గొవాలని రామారావు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CPM