TRINETHRAM NEWS

విధి నిర్వహణలో సమయ పాలన పాటించాలి- జవాబుదారీతనం ఉండాలి – కలెక్టర్ పి ప్రశాంతి

Trinethram News : రాజమహేంద్రవరం. క్షేత్ర స్థాయిలో రీ సర్వే ప్రక్రియను నిర్దుష్టమైన మార్గదర్శకాలను అనుసరించి నిర్ణీత సమయంలో పూర్తి చెయ్యాల్సి ఉంటుందని, అందులో భాగంగా నిర్లక్ష్యం వహించిన అధికారులకు సిబ్బందికి షో కాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు.
నిబంధనలు అనుసరించి సచివాలయం సర్వీసెస్ స్టేటస్ రిపోర్ట్‌ను ధృవీకరించిన తర్వాత, నిర్దిష్ట గ్రామ సర్వేయర్లు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడం లేదని జిల్లా యంత్రాంగం దృష్టికి రావడం జరిగిందన్నారు. అధికారిక విధులను నిర్వర్తించడంలో మీ నిర్లక్ష్యం మరియు ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించడంలో వైఫల్యం వలన జిల్లా పరిపాలనకు ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీసిందన్నారు.

వీటిపై వివరణ ఇవ్వాలని రాజానగరం మండలం యర్రంపాలెం గ్రామ సర్వేయర్ వి. రమేష్ కుమార్ లాగిన్‌లో ఐదు పౌర సేవలు, కానవరం గ్రామ సర్వేయర్ వై. గంగరాజు, లాగిన్‌లో నాలుగు పెండింగ్‌లో ఉండడం వల్ల జిల్లా మొత్తం పురోగతిపై ప్రభావం చూపిందన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ కి లోబడి వివరణను సమర్పించ వలసిందిగా ఆదేశించడం జరిగిందని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Collector P Prashanthi