TRINETHRAM NEWS

దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై బస్సు డ్రైవర్ లైంగిక దాడి

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Trinethram News : Telangana : శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులను ఈ నెల 4న మంచాల మండలం వద్ద ఒక రిసార్టుకు విహారయాత్రకు తీసుకెళ్ళారు

అయితే అక్కడ ఒకటో తరగతి చదువుతున్న బాలికపై బస్సు డ్రైవర్ జోసఫ్ రెడ్డి (40) లైంగిక దాడికి పాల్పడ్డాడు

అప్పటినుండి అస్వస్థతకు గురై.. రక్తస్రావం కావడాన్ని గమనించి తల్లి బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లింది

బలమైన ఒత్తిడి కారణంగా ఇలా అవుతుంది అని డాక్టర్ వెల్లడించగా, ఏం జరిగిందని చిన్నారిని ఆరా తీసిన తల్లితండ్రులు

విహారయాత్రకు వెళ్ళినప్పుడు బస్సు డ్రైవర్ తనను టాయిలెట్లోకి తీసుకెళ్ళి లైంగిక దాడి చేసినట్టు చిన్నారి తెలిపింది

విషయం తెలుసుకున్న తల్లితండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్ ను నిలదీయగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు

దీంతో మంచాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు .. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Atrocious