![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-20.48.33.jpeg)
దేవాలయాలపై రాజకీయాలు తగదు: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి
హిందూ దేవుళ్ళ విగ్రహప్రతిష్ట ఆపటామేన బిజెపి ఎజెండా
త్రినేత్రం న్యూస్. అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం కొత్తూరుగ్రామంలో జగనన్న కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన హిందూ దేవాలయాన్ని అనుమతులు లేవంటూ అధికారులు శుక్రవారం జరగవలసిన విగ్రహ ప్రతిష్ట నిలుపుదల చేశారు. పోలీసులు, మండల అధికారులు దేవాలయం నిర్మాణానికి అనుమతులు లేవని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిలుపుదల చేశారు. జగనన్న కాలనీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
ఈ సందర్భంగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ హిందూ దేవాలయంలో విగ్రహప్రతిష్ట ఆపుచేయటం అంటే యావత్ హిందూ మతాన్ని అవమానించటమేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కేవలం గుడి నిర్మించింది వైఎస్ఆర్సిపి సానుబూతుపరుడని ఒకే ఒక్క కారణంతో టిడిపి పార్టీకి సంబంధించిన వారి చేత కంప్లైంట్ లు పెట్టించి గుడి విగ్రహప్రతిష్ట నిలిపివేయడం సమంజసం కాదు అని, అక్కడ ఎటువంటి వర్గ, కుల,మత, విభేదాలు లేనని అటువంటిది అక్కడ ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు అని, గతంలో చాలాచోట్ల దేవాలయాలపై రాజకీయం చేయకూడదని చెప్పిన వారే దేవాలయాలపై రాజకీయం చేయడం ఏమిటని డాక్టర్ ప్రశ్నించారు.
ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్ర ఎవరది అనేది ప్రజలు గమనిస్తున్నారని బిజెపి ఎమ్మెల్యేగా గెలిచి హిందూ దేవాలయాలపై రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు బిజెపి అంటే హిందుత్వమే మా ఎజెండా అని అంటుంటారని హిందూ దేవాలయాల విగ్రహ ప్రతిష్ట ఆపు చేయడమైన మీ ఎజెండా నా అని ఈ సందర్భంగా సూర్యనారాయణరెడ్డి ప్రశ్నించారు. హిందూ మతానికి చెందిన భక్తులు కూడ కూడా ఎమ్మెల్యే తీరును ఎండగడుతూ వీడియోలు కూడా విడుదల చేశారని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. గత ఐదు ఆరు నెలలుగా దేవాలయం నిర్మాణం జరుగుతుండగా దేవాలయం నిర్మాణాన్ని అనుమతులు లేవని దేవాలయం నిర్మాణం పూర్తయినాక గుర్తు వచ్చిందా అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడ ఏ గుడికి లేని అనుమతులు కేవలం ఇక్కడ అనుమతులు కావాలి అని అనడం ఎంతవరకు కరెక్ట్ అని డాక్టర్ సత్తి ప్రశ్నంచారు. కేవలం గుడి నిర్మాణం చేసింది వైఎస్ఆర్సిపి సానుభూతిపరుడు అని అతనిపై ఏది విధంగా కక్ష సాధింపు చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు అని, గుడిలో విగ్రహ ప్రతిష్ట చేసి సుమారు 6000 మందికి భోజనాలు పెట్టే కార్యక్రమం అపుజెయటం చాలా దుర్మార్గమైన పని అని, విగ్రహ ప్రతిష్ట విగ్రహాలు ప్రతిష్ట చేయకుండా ఉండటం గ్రామానికి అరిష్టమని అక్కడ ప్రజలంతా భయపడుతున్నారని ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Former MLA Dr. Satthi](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-20.48.33.jpeg)