ఘనంగా కనకదుర్గమ్మ విగ్రహ పునర్ ప్రతిష్ట
` భారీగా తరలివచ్చిన భక్తులు.. అన్నదానం
Trinethram News : రాజమహేంద్రవరం : స్థానిక నారాయణపురం గోపాల్ నగర్ పుంత రోడ్డులో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహ పున ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11.26 గంటలకు శాస్త్రోక్తంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనా కార్యక్రమం జరిగింది. అనంతరం అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మార్మోగాయి.
హోమాలు ముగిసిన అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహించి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేసారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాధ్, పలువురు నగర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మండ మోహన్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు మలిశెట్టి వాసు, వెంపా వెంకన్న, విన్నకోట తాతాజీ, పెంకే నాగరాజు, పోలవరపు పవన్, కండవల్లి వెంకటరత్నం, తుమ్మపల్లి ఆనంద్, ఎస్‌కె భాషా, నాయుడు, మునసా అప్పారావు, మలిశెట్టి చలపతి, నాగులాపల్లి శంకర్రావు, నరసింహరాజు, దాతలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App