ఘనంగా ముగిసిన గిరిజన సంస్కృతిక మహోత్సవం
ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ (టి ఎస్ ఎఫ్ ) ఆధ్వర్యంలో నన్నయ విశ్వ విద్యాలయములో రెండో రోజు జరిగిన గిరిజన సాంస్కృతిక మహోత్సవం గురువారం ఘనంగా ముగిశాయి.టిఎస్ఎఫ్ వ్యవస్థాపకులు మల్లిబాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు కరంసి అక్కులప్ప నాయక్, టి ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాగిరి చంద్రప్ప, టి ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూడవత్ విష్ణునాయక్ లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి పెద్దపీట వేయాలని,గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని , గిరిజన విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని అన్నారు.
అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రతి గిరిజన కుటుంబానికి వర్తింప జేయాలని, ప్రభుత్వం మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టి ఎస్ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్ర నాయక్, మహిళా అ ద్య క్షురాలు మధులత, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నరేష్,రాష్ట్ర నాయకులు హేమలత, రామరాజు,వెంకటేశ్వర్లు నాయక్, రఘునాథ్, రాజశేఖర్, వెంకటేష్, సుమిత్, వినోద్, లోక్యానాయక్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App