ఆకట్టుకున్న చిన్నారి మాస్టర్ చెఫ్‌లు
-అంగన్‌వాడీ కార్యకర్త సాయిబిందు వినూత్న ఆలోచన
రాజమహేంద్రవరం : స్థానిక 21వ డివిజన్ ఉల్లితోట వీధిలో ఉన్న అంగన్ వాడీ కేంద్రం ఉల్లితోట`2 కోడ్ నెంబర్ 524లో ఇసిసిఇ డేలో భాగంగా కార్యకర్త సాయిబిందు వినూత్న ఆలోచనతో ప్రీ స్కూలు పిల్లలతో హెల్తీ ఫుడ్ డెమాన్‌స్ట్రేషన్ (మాస్టర్ చెఫ్) పేరుతో మెలకలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ విశిష్టత తెలిసేలా చిన్నారి చెఫ్‌లతో ప్రదర్శన అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాజెక్టు ఆఫీసర్ సిహెచ్ నరసమ్మ హాజరై చిన్నారులకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ జి.అచ్చియమ్మ, మహిళా సంరక్షణ కార్యదర్శి కెఎ సుధా స్రవంతి, ఆరోగ్య కార్యదర్శి వి.సత్యవతి, అంగన్‌వాడీ కార్యకర్త ఎ.సాయిబిందు, హెల్పర్ పి.ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App