నిరుపేద చిన్నారికి చేయూతని అందించిన ఆర్కే గ్రూప్ డైరెక్టర్ కటుకు ప్రవీణ్ కుమార్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని వీర్లపల్లి గ్రామంలో కూలి పని చేసుకుంటూ నివసించే చంద్రగిరి సతీష్ మానస దంపతుల కొడుకు తనుష్ వన్ ఇయర్ బాబు ఇంట్లో ఆడుతుండగా వేడి నీరు మీద పడి ఒళ్లంత కాళి పోయి హాస్పటల్ చికిత్స పొందుతున్నాడు. అయితే బాబు తండ్రి కూలీ పని చేస్తూ ఉండటం వలన వైద్య ఖర్చులు కూడా లేక పోవడం వలన, ఈ విషయం తెలుసుకున్న ఆర్కే గ్రూప్ డైరెక్టర్ కటుకు ప్రవీణ్ కుమార్ కటుకు నాగయ్య చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహకారంతో 12,200 రూపాయలు ఇవ్వడం జరిగింది.అలాగే తర్వాత కూడా పాప హాస్పటల్ ఖర్చుల నిమిత్తం ట్రస్ట్ సహాయ సహకారాలు ఉంటాయి అని చైర్మన్ కటుకు ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో విఠల్ నగర్ ఆటో స్టాండ్ యూనియన్ మాజీ ప్రెసిడెంట్ దండే మహేందర్, వీర్ల పల్లి డీలర్ రాజేశం మరియు ట్రస్ట్ సభ్యులు నిమ్మతి వేణు, వరప్రసాద్, కళ్యాణ్,అరవింద్, ప్రశాంత్, నరసింహులు,ఓదెలు, పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App