న్యాయవాదులకు భద్రత కల్పించడం,లో ప్రభుత్వం వైఫల్యం
Trinethram News : Andhra Pradesh : న్యాయవాదులకు భద్రత కల్పించటంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయని ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా) ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రసంగించారు .
న్యాయవాదుల భద్రత పై అలా నిరంతరం శ్రమిస్తుందని, బాధిత న్యాయవాదికి అండగా నిలవటంలో ఆలా ముందు వుంటుందని ఆలా అధ్యక్షులు ఎమ్ వి రాజారామ్ , కార్యదర్శి అవధానుల హరి భరోసా ఇచ్చారు .
కర్నూల్ జిల్లా డోన్ న్యాయవాది ఎల్. కృష్ణ ప్రసాద్ పై ఇంతియాజ్ అను ఇన్సెపెక్టర్ అధికార దుర్వినియోగంతో అక్రమ కేసులు బనాయించటం దారుణ మైన ఘటనగా బావించాలన్నారు . న్యాయపరంగా ఇన్సెపెక్టర్ ఇంతియాజ్ కు తగిన గుణపాఠం చెబుతామని, భాధిత న్యాయవాదికి ఆలా అండగా నిలుస్తుందని వారు తెలిపారు .
ఇప్పటికే న్యాయవాది కృష్ణ ప్రసాద్ పై బనాయించిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని లిఖిత పూర్వకంగా విజ్ఞాపన చేయటం జరిగిందని వారు తెలిపారు . న్యాయవాదులు పోలీస్ లు సమన్వయంతో పని చేస్తేనే సమాజం సుబిక్షతంగా వుంటుందని , సొంత ప్రయోజనాలతో విధులు నిర్వహిస్తే న్యాయస్థానాలు చూస్తు కూర్చోవని వారు హెచ్చిరించారు . అడ్వకేట్స్ కు ప్రత్యేక భద్రతా చట్టం అమలు చేయటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ద చూపటం లేదని వారు పాలకులపై అసహనం వ్యక్తం పరిచారు .
ఈ విలేఖరుల సమావేశంలో సీనియర్ న్యాయవాది నాగేశ్వరావు, సతీష్ బాబు, బాధిత న్యాయవాది ఎల్. కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొనియున్నారు ..
—మేడా శ్రీనివాస్ ,
ప్రధాన కార్యదర్శి ,
ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా)
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App