TRINETHRAM NEWS

గాయత్రి విద్యానికేతన్ లో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి . ఈ రోజు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి పలువురు బాలబాలికలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వేద పండితులు ప్రవీణ్ సిద్ధాంతి వేద మంత్రోచ్ఛారణల చేత పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు.
ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ సరస్వతీ దేవి ఆశీస్సులు ఉన్న వారి జీవితాల్లో అజ్ఞానమనే చీకట్లు తొలగిపోయి జ్ఞానమనే వెలుగులు నిండుతాయని నమ్మకం. అందుకే వసంత పంచమి రోజున సంగీతం, కళల దేవత, విద్యా దేవత అయిన సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అన్నారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు.

అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్షుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు. అందుకే ఈ పవిత్రమైన రోజున అక్షర శ్రీకారం చేస్తే పిల్లల జీవితాల్లో సరస్వతీ దేవి ఆశీస్సులు ఉంటాయనే నమ్మకంతో ఈ రోజున మా పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుమారుగా 60 మంది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు సరస్వతీ మాత ఆశీర్వచనం తీసుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App