భారత జట్టుకు అభినందనలు తెలియజేసిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 3: నెల్లూరు జిల్లా
డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టి రెండో సారి మహిళల అండర్-19 టీ-20 క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు తెలియజేస్తున్నాను. సమిష్టి ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడించి అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. టోర్నీ మొత్తం తనదైన బ్యాటింగ్, బౌలింగ్ తో అద్భుత ప్రదర్శన చేసిన తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష అందరికీ గర్వకారణంగా నిలిచారు. భారత మహిళల జట్టు భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App