TRINETHRAM NEWS

మండలంలో రోడ్డు ప్రమాదం

తేదీ : 02/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం డైనమిక్ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏలూరు మీటింగు కు దర్భ గూడెం మీదగా వెళ్తూ లక్ష్మీపురం సమీపంలో రోడ్డుపై యాక్సిడెంట్ జరిగి స్పృహ లేకుండా పడిపోయి ఉన్నా వ్యక్తిని చూసి కారు ఆపి వెంటనే పోలీస్ అధికారులకు తెలియజేయడం జరిగింది.
సంఘటన స్థలానికి చేరుకున్న యస్. ఐ నవీన్ తక్షణమే పోలీస్ వాహనంలో జంగారెడ్డిగూడెం ఏరియా వైద్యశాలకు తరలించారు. క్షేత్రగాత్రుడ కు మంచి వైద్యం అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించడం జరిగింది. ప్రమాదానికి గురైన వ్యక్తి జీలుగుమిల్లి మండలం, ముంపు గ్రామం బోరెడుగూడెం ని కి చెందిన కలుగుల ప్రసాద్ గా. గుర్తించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App