మార్కాపురం కార్పెంటర్స్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా ఆకుమళ్ళ వెంకటేశ్వర్లు
త్రినేత్రం న్యూస్ మార్కాపురం : ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ కార్పెంటర్స్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా ఆకుమళ్ళ వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం పట్టణంలో యూనియన్ లోని కార్పెంటర్స్ అందరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అందరూ కలిసి నూతన కార్పెంటర్స్ యూనియన్ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కార్పెంటర్స్ యూనియన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకటేశ్వర్లు అన్నారు. ఇక నుంచి ప్రతి నెల 1వ తేదీ కార్పెంటర్లకు సెలవు ఉంటుందని వెల్లడించారు. ఆరోజు ఎవరు కూడా కార్పెంటర్లు పనులు చేయరాదని తెలిపారు. కార్యక్రమంలో టింబర్ డిపో యజమానులు కార్పెంటర్స్ మరియు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App