జక్కంపూడి రాజాకు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు
పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి
జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులకు జక్కంపూడి రాజా సూచన…
Trinethram News : రాజానగరం ఫిబ్రవరి 2: పార్టీ బలోపేతానికి అంకితభావంతో పని చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మరియు రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా ఇటీవల పార్టీ ప్రకటించిన జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులకు సూచించారు..
రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా బీసీ సెల్ విభాగ అధ్యక్షు లుగా కొండపల్లి దుర్గారావు,జిల్లా ప్రచార విభాగ అధ్యక్షులుగా అడబాల చిన్నబాబు, సోషల్ మీడియా ఇన్చార్జిగా వల్లభశెట్టి వీరవెంకట సత్యనారాయణ నియమితులైన సందర్భంగా ఆదివారం రాజమహేంద్రవరం ప్రకాశంనగర్ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కార్యాలయం నందు రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మరియు రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజాను మర్యాద పూర్వకంగా కలుసుకొని కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులుగా ఎంపికైన వారిని జక్కంపూడి రాజా శాలువా కప్పి ఘనంగా సత్కరించారు..
ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో సరైన గుర్తింపు ఉంటుందని,పదవులు పొందిన ప్రతి ఒక్కరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మరియు కార్యకర్తలతో నిత్యం మమేకవుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయా లని,రాబోవు స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు..
ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు వాసంశెట్టి పెద్ద వెంకన్న,కర్రీ నాగేశ్వరావు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్క రాంబాబు గణేశుల పోశ రావు,కళ్యాణ రాంబాబు నీలాపాల శివరామ కృష్ణ,సర్పంచ్ మారికుర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App