తేదీ : 02/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో రైతులకు మొండి చేయి చూపారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ విమర్శించడం జరిగింది.
కేంద్ర బడ్జెట్ పై ఏలూరులో మాట్లాడుతూ రైతులు ఆశించిన విధంగా కేంద్ర బడ్జెట్ లేదన్నారు. మద్దతు ధరల గ్యారంటీ చట్టంపై ఎటువంటి హామీ ఇవ్వకపోవడం రైతులను మోసగించడమే అని తెలిపారు. ఎరువులు సబ్సిడీ మరింతగా పెంచాలన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App