బడ్జెట్‌కు ముందే సిలిండర్ ధరలపై ఊరట, సవరించిన ధరలు నేటి నుంచి అమల్లోకి
దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు దిగొచ్చాయి. రూ.7 మేర 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది.
Trinethram News : న్యూఢిల్లీ : మరికొన్ని గంటల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా గ్యాస్ సిలిండర్ ధరలపై ఊరట లభించింది. వాణిజ్య సిలిండర్ ధర రూ.7 మేర స్వల్పంగా దిగొచ్చింది. హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలలో వినియోగించే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌కు తాజా సవరింపు ధర వర్తించనుంది. దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1,797కు దిగొచ్చింది. ప్రపంచ మార్కెట్లలో ముడి చమురు రేట్లలో హెచ్చుతగ్గులు మన దేశంలోనూ LPG గ్యాస్ సిలిండర్లపై ప్రభావం చూపుతాయి. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరలు యథాతథంగా ఉన్నాయి.
వరుసగా 5 నెలలపాటు వరుసగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర (LPG Cylinder Price) నూతన సంవత్సరం నాడు దిగొచ్చింది. ప్రతినెలా ఒకటో తేదీన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరల్ని చమురు కంపెనీలు సవరిస్తుంటాయి. చివరగా డిసెంబర్ 1న కమర్షియల్ సిలిండర్‌పై రూ.16.5 పెరిగింది. ఓవరాల్ గా ఐదు నెలల్లో వాణిజ్య సిలిండర్ ధర రూ. 172.5 మేర పెరిగింది. నూతన సంవత్సరం సమయంలో రూ. 14.5 మేర తగ్గించారు. కానీ డొమెస్టిక్ వంట గ్యాస్ 14.2 కిలోల సిలిండర్ రూ.803 గా ఉంది.
పలు నగరాల్లో ఎల్పీజీ సిలిండర్ ధరలు
ఫిబ్రవరి 1, 2025న సవరించిన ధరల తర్వాత, ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1,797కు దిగొచ్చింది.
హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2023
ముంబైలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1,749
కోల్‌కతాలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1,907
చెన్నైలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రూ. 1,959
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App