యూరియా కోసం అన్నదాతల అష్ట కష్టాలు
చిత్తూరు జిల్లా పెనుమూరు త్రినేత్రం న్యూస్. పెనుమూరు మండలంలో ఈరోజు శనివారం తెల్లవారకముందే రైతన్నలు ఎరువుల దుకాణం ముందు బారులు తీరారు. రైతన్నలకు యూరియా దొరకక చాలా అవస్థలు పడుతున్నారు. ఈరోజు గ్రోమోర్ సెంటర్ నందు యూరియా వచ్చింది అని తెలిసి రైతులు వారి పిల్లలు గ్రోమోర్ ముందు ఆధార్ కార్డులు పట్టుకొని బారులు తీరారు.
రైతులకు కావలసిన యూరియా దొరకక అవస్థలు పడుతున్నారు. చుట్టుపక్కల 44 గ్రామాలు ఉన్నాయి. రైతులందరూ ఈ సీజన్లో వరి పంట వేశారు. దానికి వేరే దొరకక బ్లాక్లో ఎక్కువ డబ్బులు పెట్టి కొంటున్నారు. మండల కేంద్రంలో ఆర్ బి కే సొసైటీ లు ఉన్నాయి. కానీ రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయలేకపోతున్నాయి. ఆర్.బి.కె వాళ్ళని అడగ్గా గవర్నమెంట్ సప్లై ఉన్నంతవరకు ఇస్తున్నాము అన్నారు.
గ్రోమోర్ ముందు రైతులు కిలోమీటర్ మేరా లైన్లో ఉండి తీసుకోలేక తోపులాటలు జరిగి రైతన్న ఇబ్బందులు పడ్డారు గ్రోమోర్ సెంటర్ వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి పోలీసు వాళ్ళ సహాయంతో యూరియా సరఫరా సజావుగా చేశారు. ఇకనైనా వ్యవసాయ అధికారులు చొరవ తీసుకొని మండలంలో యూరియా కొరత లేకుండా చూడాలని అన్నదాతలు అంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App