TRINETHRAM NEWS

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ ప్రతిపక్షాల ఆందోళన

పార్లమెంటులో కేంద్ర బడ్జెట్-2025పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం..

Trinethram News : న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో మంత్రి నిర్మలమ్మ రికార్డు స్థాయిలో 8వ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టి, ప్రసంగిస్తున్నా. తెలుగు కవి గురజాడ అప్పారావు మాటలు దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే మాటల్ని సభలో ప్రస్తావించారు.

నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ టైంలో విపక్షాలు ఆందోళనచేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై చర్చకు విపక్ష నేతలు పట్టుబట్టారు. అందుకు స్పీకర్ నిరాకరించడంతో ఆందోళన చేపట్టారు. కొద్దిసేపయ్యాక వారు సభ నుంచి వాకౌట్ చేయగా నిర్మలమ్మ బడ్జెట్ స్పీచ్ కొనసాగించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బడ్జెట్ పై చర్చించి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Union Budget