Budget Meetings : నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

TRINETHRAM NEWS

నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

నేడు పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ముర్ము, ప్రభుత్వ లక్ష్యాలు, సాధించిన ఫలితాలను వివరించనున్న రాష్ట్రపతి.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 16 బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెడుతారు. కేంద్ర బడ్జెట్‌ను రేపు ప్రవేశపెడుతారు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌.

బడ్జెట్‌ సమావేశాల్లో ఆర్థిక బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, వక్ఫ్‌ సవరణ బిల్లుతో సహా మొత్తం 16 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్నారు. రెండు విడతలు జరిగే ఈ సమావేశాల్లో తొలి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. తొలిరోజు ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశ పెడతారు. శుక్రవారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి.

బడ్జెట్‌ను నిర్మల ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వసారి కావడం గమనార్హం. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీయే సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్‌ ఇదే.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరగనున్నాయి. ఈ బడ్జెట్‌లోనైనా ప్రత్యక్ష పన్నుల (ఆదాయపు పన్ను) శ్లాబ్ సడలించి మధ్యతరగతి వేతన జీవులకు ఊరట కల్గిస్తారా అని దేశంలోని ఉద్యోగవర్గాలు ఎదురుచూస్తున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top